నిజాంపేట్, మంజీరా వాటర్ ట్యాంక్ దగ్గర గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని ఆలయ వ్యవస్థాపకులైన
శ్రీ ఏనుగుల సురేందర్ రెడ్డి అనురాధ దంపతులు 1985 వ సంవత్సరం లో వారి పొలములో సాయిబాబా
విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని స్థాపించడం జరిగింది, సాయిబాబా విగ్రహంతో పాటు శ్రీ
సీతారాములు వారి విగ్రహం, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం, శ్రీ ఆంజనేయ స్వామి వారి
విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, శ్రీ ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం,గణపతి విగ్రహాలను ప్రతిష్టించి
ఆనాటి నుండే పూజ పునస్కారాలు నిర్వహిస్తూ వచ్చారు. నాటి నుండే ప్రతి గురువారం అన్నదాన
కార్యక్రమం,పల్లకి సేవ ఇంకా పూజ పునస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
కాల క్రమేణా భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అబివ్రుద్ది చేసి నేటికీ ప్రతి గురువారం ఇంకా పర్వ
దినాలలో భారీ ఎత్తున అన్నదానము, ప్రతీరోజు పూజాపురస్కారలను నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు
ట్రస్ట్ తరుపున సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.